ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యాకానుక తీసుకొని వస్తుండగా ప్రమాదం... ఒకరు మృతి - ananthapuram district crime

అనంతపురం జిల్లా కదిరి పట్టణం సమీపంలో 42వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఐషర్​, ద్విచక్రవాహనం ఢీకొన్న ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

one man death and one sevearly injured in kadiri road accident in ananthapuram district
కదిరిలో రోడ్డు ప్రమాదం

By

Published : Oct 9, 2020, 6:09 PM IST

అనంతపురం జిల్లా కదిరి పూలబజార్​కు చెందిన కవిత, తన కుమారుడు సాయి గణేష్​తో కలిసి.. నల్లచెరువు ఆదర్శ పాఠశాలలో విద్యాకానుక కిట్ తీసుకోవటానికి వెళ్లారు. కిట్ తీసుకుని తిరిగి వస్తుండగా... వారు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఐషర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కవిత అక్కడిక్కడే మృతి చెందింది. సాయి గణేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురంకు తరలించారు.

ABOUT THE AUTHOR

...view details