మలిరెడ్డి పల్లి వద్ద రోడ్డు ప్రమాదం.. వ్యక్తి దుర్మరణం - అనంతపురంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి వార్తలు
అద్దానం పల్లికి చెందిన వ్యక్తి అనంతపురం జిల్లా మలిరెడ్డి పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. కర్ణాటకలోని చాకివేలుకు ద్విచక్రవాహనంపై వెళ్లిన నరసింహులు తిరుగు ప్రయాణంలో ఇంటికి సమీపంలోనే ప్రమాదానికి గురైయ్యాడు.
అనంతపురం జిల్లా మలిరెడ్డి పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మండల పరిధిలోని అద్దానం పల్లికి చెందిన నరసింహులు అనే వ్యక్తి మిత్రుడితో కలిసి కర్ణాటకలోని చాకివేలుకు ద్విచక్రవాహనంపై వ్యక్తిగత పనిమీద వెళ్లారు. పని ముగించుకొని తిరుగు ప్రయాణమైన వారు ఇంటికి సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. మలిరెడ్డిపల్లి సమీపంలో ఉన్న కల్వర్టు వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో నరసింహులు తలకు బలమైన గాయాలు కావడం వల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై తనకల్లు పోలీసులు కేసు నమోదు చేశారు.