అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం లోని నలగొండరాయునపల్లి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొని యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సోమందేపల్లి మండల కేంద్రంలోని ఇందిరా నగర్‌కు చెందిన వాలంటీరు దేవరాజు... మరో ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా ప్రమాదవశాత్తు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో దేవరాజ్ మృతిచెందాడు. సోమందేపల్లికి చెందిన జగదీష్, చాకర్లపల్లికి చెందిన శ్రీకాంత్‌కు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను పెనుగొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. ప్రాథమిక చికిత్స అనంతరం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. ఈ ఘటనపై సోమందేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
డివైడర్ను ఢీకొన్న బైక్.... ఒకరి మృతి, ఇద్దరికి గాయాలు.. - Bike accident at Anantapur District Somandepalli
ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదం అనంతపురం జిల్లా సోమందేపల్లిలో జరిగింది. మృతుడు ఇందిరానగర్‌కు చెందిన వాలంటీర్ దేవరాజ్‌గా గుర్తించారు.
అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న బైక్.... ఒకరి మృతి, మరో ఇద్దరికి గాయాలు..
ఇవీ చదవండి