అనంతపురం జిల్లాలోని పెనుకొండను కొత్త జిల్లాగా ప్రకటించాలని కోరుతూ పెనుకొండ జిల్లా సాధన కమిటి ఆధ్వర్యంలో లక్ష సంతకాల సేకరణ చేపట్టారు. ఈరోజు ఉదయం పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలోని అంబేడ్కర్ కూడలి, తెలుగు తల్లి కూడలిలో కమిటీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేశారు. దీనిలో కమిటీ సభ్యులు రవూఫ్, నరహరిప్రసాద్, పాలూరి క్రిష్ణమూర్తి, రామక్రిష్ణ, సీపీఐ పెనుకొండ డివిజన్ కార్యదర్శి శ్రీరాములు, తదితరులు పాల్గొన్నారు.
'పెనుకొండ' జిల్లా కోసం లక్ష సంతకాలు - అనంతపురం
అనంతపురంలోని పెనుకొండను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. పెనుకొండ జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
'పెనుకొండ' జిల్లా కోసం లక్ష సంతకాలు