ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఆర్టీసీ బస్సు బీభత్సం.. ఒకరు మృతి - అనంతపురం కలెక్టరేట్ వార్తలు

అనంతపురం కలెక్టరేట్ ముందు ఆర్టీసీ బస్సు రెండు కార్లను, ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మరణించగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఘటనాస్థలి నుంచి బస్సును డిపోకు తీసుకెళ్లారు.

one died in rtc bus collide to cars at  anantapur collectorate
అనంతపురం కలెక్టరేట్ ముందు ఆర్టీసీ బస్సు బీభత్సం

By

Published : Jun 27, 2021, 11:22 AM IST

అనంతపురంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. హిందూపురం నుంచి అనంతపురం నగరానికి వస్తున్న ఆర్టీసీ బస్సు కలెక్టర్ కార్యాలయం వద్ద రెండు కార్లను, ఓ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న హరి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులతో సహా.. బైక్‌పై ఉన్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ఘటన స్థలం నుంచి ఆర్టీసీ బస్సు అనంతపురం డిపోకి తీసుకెళ్లారు. ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details