ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కారు ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి - రామరాజుపల్లి రోడ్డు ప్రమాదం

కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్ర వాహనం రోడ్డు దాటుతుండగా.. వేగంగా వచ్చిన కారు దానిని ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.

accident
accident

By

Published : Aug 26, 2021, 1:28 AM IST

అనంతపురం జిల్లా పామిడి మండలం రామరాజు పల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని, కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెన్నారెడ్డి అనే వ్యక్తి మృతి చెందాడు. నాగరత్నమ్మ అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ దంపతులు ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వచ్చిన కారు.. ఆ వాహనాన్ని ఢీకొట్టిందని పామిడి సీఐ శ్యామ్ రావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details