ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రోడ్డు ప్రమాదాల్లో మహిళ మృతి ... మరో ముగ్గురికి గాయాలు - అనంతపుర్ం నేర వార్తలు

అనంతపురం జిల్లాలో శనివారం రెండు వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో ఓ మహిళ మృతి చెందగా ... మరో ముగ్గురికి గాయలయ్యాయి.

women died
మహిళ మృతి

By

Published : Jan 3, 2021, 4:29 AM IST

అనంతపురం గ్రామీణం కురుగుంట వద్ద ఇన్నోవా వాహనం ఢీకొని గుర్తు తెలియని మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె రోడ్డు దాటే క్రమంలో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. మహిళ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారని చెప్పారు. వాహనం కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

కియా ఉద్యోగులకు గాయాలు

అనంతపురం జిల్లా ధర్మవరం సమీపంలోని ప్యాదిండి గ్రామం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారు ధర్మవరం నుంచి ద్విచక్ర వాహనంపై పెనుకొండ వెళ్తుండగా ఎదురుగా వస్తున్న కారును ఢీ కొట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి తీసుకెళ్లారు. కర్నూలు జిల్లా డోన్, మహానంది, సంజామల ప్రాంతానికి చెందిన వీరంతా కియా పరిశ్రమలో పని చేస్తున్నారు. విధులకు వెళ్లి తిరిగి వచ్చిన వీరు... స్నేహితుడు ఫోన్​ చేయటంతో మళ్లీ పని చేసే చోటుకు పయనమయ్యారు. ఈ క్రమంలో ప్రమాదం జరిగిందని... దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి:'హిందూ దేవాలయాలపై ప్రభుత్వం దాడులకు పాల్పడుతోంది'

ABOUT THE AUTHOR

...view details