Uravakonda: అనంతపురం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉరవకొండ మండలం పెద్ద కొట్టాల పల్లిలో ఒకే రోజు వ్యవధిలో నానమ్మ, మనువడు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. ఒకేసారి ఇద్దరి అకాల మరణంతో ఆ కుటుంబ రోదనలు మిన్నంటాయి. ఇంటిి పెద్దావిడ పోయిందనే శోకంలో ఉన్న ఆ కుటుంబానికి చేతికొచ్చిన కుమారుడు కూడా చనిపోయాడన్న వార్తతో.. బోరున విలపించిన ఆ తల్లిదండ్రులు, స్పృహ తప్పి కుప్పకూలిపోయారు. ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
ఒకేరోజు వ్యవధిలో.. నానమ్మ అంత్యక్రియల ఏర్పాట్లు చూస్తూ, మనువడు మృతి
Uravakonda: ఆ ఇంటిపై విధి కక్ష గట్టింది. గంటల వ్యవధిలో నానమ్మ, మనవడు మృతి చెందారు. నానమ్మ చనిపోయిందని.. అంత్యక్రియ ఏర్పాట్లలో భాగంగా బయటకు వెళ్ళిన మనవడు, శవమై ఇంటికి వచ్చాడు. పెద్దావిడ చనిపోయిందనే శోకంలో ఉన్న ఆ ఇంటికి.. కుమారుడు కూడా మరణించాడన్న వార్త.. ఆ కుటుంబాన్ని తల్లిడిల్లేలా చేసింది. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. విగత జీవిగా ఉన్న కుమారుడిని చూసిన ఆ తల్లిదండ్రులు.. స్పృహ తప్పి కుప్పకూలిపోయారు. ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా ఉరవకొండలో జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉరవకొండ పెద్ద కొట్టాల పల్లికి చెందిన యల్లమ్మ(80) శనివారం మధ్యాహ్నం 12.30గంటల ప్రాంతంలో అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె అంత్యక్రియలు ఆదివారం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కుర్చీలు, షామియానాను విడపనకల్లు నుంచి తెచ్చేందుకు మనువడు వంశీ (19) ఆటోలో బయలుదేరాడు. మాళాపురం వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. వంశీ ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు.
ఇవీ చదవండి: