fire accident: అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో దారుణం జరిగింది. ప్రమాదవశాత్తు పూరి గుడిసెకు నిప్పంటుకుని ఆశాబీ (66) అనే వృద్ధురాలు సజీవ దహనమైంది. పట్టణానికి చెందిన అశాబి ఒంటరి వృద్దురాలు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ మీద ఆధారాపడి జీవిస్తోంది. అయితే.. సోమవారం తెల్లవారుజామున ఆమె గుడిసెకు ప్రమాదవశాత్తు నిప్పంటుకుని పూర్తిగా కాలిపోయింది.
fire accident: నిద్రిస్తుండగా.. గుడిసెకు నిప్పంటుకొని దారుణం - ap crime
fire accident: గుడిసెకు నిప్పంటుకొని వృద్ధురాలు సజీవ దహనమైంది. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో జరిగింది.

వృద్ధురాలు సజీవదహనం
ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ఆశాబీ అగ్నికి ఆహుతైంది. స్థానికులు గమనించి మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. రాయదుర్గం అర్బన్ సీఐ సురేశ్ బాబు, మున్సిపల్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అది ప్రమాదమా? కాదా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: