ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యార్థినిపై వృద్ధుడు అత్యాచారం..పట్టుకుని పోలీసులకు అప్పగించిన యువకులు - కదిరిలో అత్యాచారం చేసిన వృద్ధుడు అరెస్ట్

పాఠశాల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఓ వృద్ధుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతపురం జిల్లా కదిరి మండలంలో నిందితుడు ఆమెకు మాయమాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడగా.. కొందరు యువకులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

old man raped student in kadiri, kadiri student raped by old man
కదిరిలో విద్యార్థినిపై వృద్ధుడి అత్యాచారం, కదిరిలో అత్యాచారాలు

By

Published : Apr 17, 2021, 3:05 PM IST

అనంతపురం జిల్లా కదిరి మండలంలో ఓ బాలికపై అత్యాచారం చేసిన వృద్ధుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినికి వృద్ధుడు మాయమాటలు చెప్పి.. రాత్రి 8 గంటల సమయంలో పాఠశాల ఆవరణలోకి వెళ్లమన్నాడు. బాలిక వెళ్లిన అనంతరం ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

ఇదీ చదవండి:లాలూకు బెయిల్- జైలు నుంచి విముక్తి!

రాత్రివేళ మనుషుల కదలికలు గుర్తించిన స్థానిక యువకులు.. పాఠాశాల ఆవరణలోనికి వెళ్లారు. వారిని చూసి వృద్ధుడు పారిపోయేందుకు యత్నించాడు. యువకులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు కదిరి డీఎస్పీ భవ్యకిషోర్ తెలిపారు.

ఇదీ చదవండి:

మహిళతో అసభ్య ప్రవర్తన.. 21మంది అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details