ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పది రోజుల క్రితం వృద్ధుడి అదృశ్యం... - kadiri rural police station

అనంతపురం జిల్లా కదిరి మండంలం యాకాలచెర్వు కొత్తపల్లిలో పది రోజుల క్రితం కూలి పనులకని చెప్పి వెళ్లిన ఓ వృద్ధుడు అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు అతని కోసం పరిసర ప్రాంతాలతో పాటు బంధువుల ఇళ్లలో వెతికినా అతని ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు కదిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

old man missing in ananthapuram
వృద్ధుడి అదృశ్యం

By

Published : Dec 18, 2020, 9:58 AM IST

అనంతపురం జిల్లా కదిరి మండలం యాకాలచెర్వు కొత్తపల్లిలో పది రోజుల క్రితం కూలి పనులకు వెళ్లిన ఓ వృద్ధుడు అదృశ్యమయ్యాడు. కుటుం సభ్యులు అతని కోసం వెతికి ఆచూకీ లభించకపోవడంతో కదిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాకాలచెర్వు కొత్తపల్లి గ్రామానికి చెందిన మీసాల నరసింహులు కూలిపనుల కోసం వెళ్తున్నానంటూ ఈ నెల 8న ఇంటి నుంచి వెళ్ళాడు. ఆ రోజు నుంచి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు.. బంధువుల గ్రామాలతో పాటు.. కదిరి పరిసర ప్రాంతాల్లోనూ వెతికారు. అయినా వృద్ధుడి ఆచూకీ తెలియక పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎవరికైనా ఆచూకీ తెలిస్తే కదిరి రూరల్ పోలీస్ స్టేషన్​కు కానీ.. 944099001882 సెల్ నంబర్ కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details