suicide: చెట్టుకు ఉరివేసుకోని వృద్దుడు ఆత్మహత్య - అనంతపురం జిల్లా నేర వార్తలు
అనంతపురం జిల్లా గుడిబండ మండలంలో ఓ వృద్ధుడు చెట్టుకు ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అనంతపురం జిల్లా గుడిబండ మండలం మోరుబాగల్ గ్రామంలో నాగప్ప అనే వృద్దుడు చెట్టుకు ఉరివేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. అతను రెండు సంవత్సరాలు గా కడపునొప్పితో బాధపడుతున్నాడు. ప్రభుత్వం అందించే వృద్ధాప్య పింఛన్ డబ్బులతో మందులు కొనుగోలు చేసి ఉపశమనం పొందేవాడు. ఆధార్ కార్డులో 55 సంవత్సరాలు వయస్సున్నట్లు తప్పు దోర్లడంతో వైయస్సార్ వృద్ధాప్య పింఛన్ రెండు నెలలుగా నిలిచిపోయింది. కడపునొప్పికి మందులు కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇదీ చదవండి: