అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలు మృతి - Anantapur crime news
ఉరవకొండ పట్టణంలోని కనేకల్ క్రాస్ వద్ద శాంతమ్మ (75) అనే వృద్దురాలు అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. ఆమె భర్తే కొట్టి చంపాడని మృతురాలి బంధువుల ఆరోపిస్తున్నారు.
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని కనేకల్ క్రాస్ వద్ద శాంతమ్మ అనే వృద్ధురాలు అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. ఆమె భర్తే చంపాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఎప్పటిలాగే సమీపంలో ఉన్న కూతురు ఇంట్లో అల్పాహారం చేసి వచ్చింది. మధ్యాహ్నం భోజనానికి పిలిచేందుకు కూతురు షెడ్డు వద్దకు వచ్చి చూడగా... ఉలుకూపలుకు లేకుండా పడిఉన్న తల్లిని చూసి నిర్ఘాంతపోయింది. తల్లి మరణించిందని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చింది. తన తల్లి శాంతమ్మ, తండ్రి వెంకటరెడ్డిల మధ్య కొద్దిరోజులుగా మనస్పర్ధలు ఉన్నాయని... ఇటీవల కొట్టడంతో పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. అయితే ఆమెను భర్త వెంకటరెడ్డి హత్య చేసి ఉంటాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.