అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం దేవరకొండ... ప్రభుత్వ స్థలంలోని పేదల గుడిసెలను రెవెన్యూ అధికారులు తొలగించారు. 400 గుడిసెలను జేసీబీలతో కూల్చివేశారు. తాము చెప్పేది వినిపించుకోకుండా అకస్మాత్తుగా వచ్చి ధ్వంసం చేశారని... బాధితులు వాపోయారు. రోడ్డునపడ్డ కుటుంబాలు ధర్నాకి దిగగా... ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. తహసీల్దార్ కార్యాలయం వద్దకు బాధితులు చేరుకొని ఎమ్మార్వో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తాము చట్టపరంగానే గుడిసెలు తొలగించామని... అర్హులైన వారికి వేరే ప్రాంతంలో భూమి కేటాయిస్తామని తహసీల్దార్ మహబూబ్ బాషా తెలిపారు.
పేదలు గుడిసెలు తొలగించిన అధికారులు - అనంతపురం జిల్లా దేవరకొండలోని ప్రభుత్వ స్థలం వార్తలు
అనంతపురం జిల్లా దేవరకొండలోని ప్రభుత్వ స్థలంలో పేదలు వేసుకున్న 400 గుడిసెలను అధికారులు తొలగించారు. బాధితులు ధర్నాకు దిగగా... ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
![పేదలు గుడిసెలు తొలగించిన అధికారులు Officers removed 400 huts worn by the poor at devarakonda in ananthapur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5518418-73-5518418-1577519506718.jpg)
దేవరకొండలో ఉద్రిక్త పరిస్థితి