వలస కార్మికులను స్వస్థలాలకు తరలిస్తున్న అధికారులు - migrant workers latest news madakashira
మడకశిర నియోజకవర్గంలో ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులను వారి సొంత రాష్ట్రాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

జెండా ఊపి బస్సును ప్రారంభిస్తున్న అధికారులు
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని వలస కార్మికులు వారి స్వస్థలాలకు పంపించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. శ్రామిక్ రైళ్లలో వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరిలించేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు నియోజకవర్గంలోని 15 మంది వలస కార్మికులను మడకశిర నుంచి అనంతపురం రైల్వే స్టేషన్ కు తరలించారు. వారు ప్రయాణీస్తున్న బస్సును ఎమ్మార్వో ఆనంద్ కుమార్, సీఐ రాజేంద్రప్రసాద్ మున్సిపల్ అధికారులు జెండా ఊపి ప్రారంభించారు.