ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెనుకొండలో నామినేషన్లు స్వీకరించని అధికారులు - అనంతపురం తాజా వార్తలు

అనంతపురం జిల్లా పెనుకొండలో ఎన్నికల నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన తెదేపా నాయకుల నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించలేదు. ఎన్నికలకు సంబంధించి జిల్లా ఉన్నతధికారులనుంచి ఎలాంటి ఉత్తర్వులు అందలేదని ఎంపీడీవో శివశంకరప్ప అన్నారు.

పెనుకొండలో నామినేషన్లు స్వీకరించని అధికారులు
పెనుకొండలో నామినేషన్లు స్వీకరించని అధికారులు

By

Published : Jan 25, 2021, 4:11 PM IST

అనంతపురం జిల్లా పెనుకొండలో నామినేషన్ పత్రాలు దాఖలు చేయడానికి వచ్చిన తెదేపా నాయకుల నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించలేదు. ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ఉత్తర్వులు అందకపోవటంతో ప్రస్తుతం నామినేషన్లు స్వీకరించడం లేదని ఎంపీడీవో శివశంకరప్ప అన్నారు. జిల్లా ఉన్నతాధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే నామినేషన్ల స్వీకరణ ప్రారంభిస్తామన్నారు.

ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటికీ అధికారులు స్పందించడం లేదని...ఇది ప్రభుత్వ వైఫల్యమా...ఎన్నికల నిర్వహణ అధికారుల వైఫల్యమా అని తెదేపా నాయకులు ప్రశ్నించారు. మెుదటి రోజున నామినేషన్లు స్వీకరించలేదు కావున...నామినేషన్ల స్వీకరణ పొడిగించాలని తెదేపా నాయకులు డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

ఎన్నికల కమిషన్ ఆదేశించినా... కానరాని అధికారులు!

ABOUT THE AUTHOR

...view details