అనంతపురం జిల్లా తాడిపత్రి RDT కాలనీలో అక్రమ కట్టడాల కూల్చివేత సందర్భంగా... వైకాపా నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైకాపా రాష్ట్ర కార్యదర్శి రమేశ్ రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. కాలనీలో సుమారు 70 ఇళ్లు అక్రమంగా కట్టారంటూ... ఎమ్మెల్యే పెద్దారెడ్డి, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూల్చివేతకు చర్యలు చేపట్టారు.
దాదాపు 10 కట్టడాలు కూల్చిన తర్వాత... రమేశ్ రెడ్డి అనుచరుడి ఇల్లు పడగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ చర్యను రమేశ్ రెడ్డి అడ్డుకున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చివరికి ఒకరోజు గడువు కావాలని రమేశ్ రెడ్డి కోరడంతో... ఎమ్మెల్యే, అధికారులు వెనుదిరిగారు.