కల్యాణదుర్గంలో ర్యాలీగా వెళ్లి నామపత్రాలు దాఖలు
కల్యాణదుర్గంలో ర్యాలీగా వెళ్లి నామపత్రాలు దాఖలు - కల్యాణదుర్గంలో నామినేషన్లు
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ప్రశాంత వాతావరణంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు చేశారు. నియోజకవర్గంలోని మున్సిపాలిటీతోపాటు 5 మండలాల పరిధిలో స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, కార్యకర్తలతో ర్యాలీగా వచ్చారు. తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి ఉమామహేశ్వర నాయుడు తమ పార్టీ అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షించారు. కంబదూరు, శెట్టూరు, బ్రహ్మసముద్రం మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగింది.

కల్యాణదుర్గంలో ర్యాలీగా వెళ్లి నామపత్రాలు దాఖలు
TAGGED:
కల్యాణదుర్గంలో నామినేషన్లు