No response from public to YCP Bus Yatra:వైసీపీ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయి. ప్రజల నుంచి వస్తున్న మద్దతు అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం సామాజిక సాధికార బస్సు యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్తున్న నేపథ్యంలో ప్రజల నుంచి స్పందన లేక మంత్రులు నోర్లు వెల్లబెట్టాల్సిన పరిస్థితులు నెలకొంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా సభలను నిర్వహిస్తున్నా ప్రజల నుంచి స్పందన లభించడం లేదు. సామాజిక సాధికార యాత్రలు అట్టహాసంగా నిర్వహిస్తున్నా సామాన్యులకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి.
అరాచకమా- బుర్రపనిచేయడం లేదా! రోడ్డు మూసేసి వైసీపీ బస్సు యాత్ర నిర్వహించడంపై జనం గగ్గోలు !
YCP Bus Yatra Anantapur:అనంతపురంలో నిర్వహించిన సామాజిక బస్సు యాత్ర ప్రారంభంలోనే జనం వెనుతిరిగారు. వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో సామాజిక సాధికార బస్సు యాత్రను చేపట్టారు. నగరంలోని పాతూరు తాడిపత్రి బస్టాండు ప్రాంతంలో సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి పోలీసుల పహారాలో ట్రాఫిక్ మళ్లించి సభను ఏర్పాటు చేసినా ఫలితం లేకపోయింది. అంబేద్కర్ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్ మీదుగా పాతూరు వరకు ర్యాలీగా వచ్చి బహిరంగ సభకు చేరుకున్నారు. అక్కడ ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేశారు.
నిస్సిగ్గుగా వైసీపీ బస్సుయాత్ర సభ - జనాలు లేకపోయినా కెమెరాల ముందు బిల్డప్
నాయకులు పూలమాల వేసిన అనంతరం కొంతమంది వైసీపీ నాయకులు అత్యుత్సాహంతో గాంధీ విగ్రహానికి ఉన్న కర్రకు వైసీపీ జెండాలు కట్టారు. దీనిని చూసిన ప్రజలు ఆశ్చర్యానికి లోనయ్యారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన గాంధీ విగ్రహానికి పార్టీ జెండాలు కట్టడం ఏంటని పలువురు ప్రశ్నించారు. సామాజిక సాధికార సభకు ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మంత్రుల పేర్ని నాని, ఉషశ్రీ చరణ్ ఇతర నాయకులు హాజరయ్యారు. నాయకుల ప్రసంగాలు ప్రారంభమవగానే ప్రజలు వెనుతిరిగారు. దీంతో వైసీపీ నాయకులు తెల్ల మొహాలు వేసుకున్నారు. అనంత వెంకట్రామిరెడ్డి సోదరుడు చంద్రారెడ్డి ఎవరూ వెళ్లకుండా చూడాలని అనుచరులకు ఆదేశించినా ఫలితం లేకపోయింది.
వెలవెలబోయిన వైసీపీ సామాజిక సాధికార సభ - ఖాళీ కుర్చీల మధ్యే మంత్రి ప్రసంగం
YCP Bus Yatra in Alluri District:అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేటలో ఏర్పాటు చేసిన సాధికారిక బస్సుయాత్ర విఫలమైంది. ఈ సమావేశానికి చుట్టుపక్కల గిరిజనులను తరలించగా వారు సభ మధ్యలోనుంచే వెనుతిరిగారు. దీంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి, మంత్రి అమర్నాథ్, పాడేరు, అరకు, మాడుగుల, చోడవరం ఎమ్మెల్యేలు, అరకు ఎంపీ, జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర ఈ సమావేశానికి వచ్చారు. వచ్చిన గిరిజనులు సభ ప్రారంభం నుంచే వెనుతిరగడంతో సామాజిక బస్సుయాత్ర వెలవెలబోయింది. అరకు, పాడేరు ప్రధాన రహదారిలో ఈ సమావేశం పెట్టడంతో వాహనదారులు ఇబ్బందులు తీవ్ర పడ్డారు.
వెలవెలబోయిన వైసీపీ బస్సు యాత్ర - సభ కోసం జనాలను తరలించినా ఫలితం శూన్యం