అనంతపురం జిల్లా తలుపుల మండలం బట్రేపల్లి అడవిలో సోమవారం దాదాపు 4,200 కిలోల టమోటాలను రైతులు ఆవులకు పడేసి వెళ్లారు. పట్టణ ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్మినా రవాణా ఖర్చులు కూడా చేతికి అందేలా లేవని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.
ధర లేక నేలపాలు.. ఆవేదనలో అన్నదాతలు - అనంతపురంలో రోడ్డుపై టమోట పడేసిన రైతులు న్యూస్
ఆరుగాలం శ్రమించి పండించిన టమాటా పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతుల ఆగ్రహించారు. రోడ్డు పక్కన పడేశారు. రవాణా ఖర్చులు సైతం చేతికి రావడం లేదని వాపోయారు.
![ధర లేక నేలపాలు.. ఆవేదనలో అన్నదాతలు no price to tomato in ananthapuram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10209045-387-10209045-1610418846127.jpg)
no price to tomato in ananthapuram