ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ ఆస్పత్రి కంటి విభాగంలో.. ఎన్ఎంసీ అధికారుల పరిశీలన - Anantapur Government Hospital

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి వైద్య విభాగంలోని సౌకర్యాలను ఎన్ఎంసీ అధికారులు పరిశీలించారు. ఆప్తమాలజీ విభాగంలో విద్యార్థులు శిక్షణ పొందటానికి ఉన్న అవకాశాలపై ఆరా తీశారు.

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన ఎన్​ఎంసీ అధికారులు
అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన ఎన్​ఎంసీ అధికారులు

By

Published : Aug 9, 2021, 5:24 PM IST

అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కంటి వైద్య విభాగంలోని సౌకర్యాలను నేషనల్ మెడికల్ కమిషన్ అధికారులు పరిశీలించారు. కంటి వైద్య విభాగంలో పది పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య సీట్ల మంజూరు కోసం ఆస్పత్రి అధికారులు ప్రభుత్వం తరఫున అభ్యర్థన పంపించారు.

ఈ మేరకు ఎన్ఎంసీ నుంచి ఇన్​స్పెక్టర్ డా.మానవ్ దీప్ సింగ్ అనంతపురం ఆసుపత్రికి వచ్చారు. ఆప్తమాలజీ విభాగంలో విద్యార్థులు శిక్షణ పొందటానికి ఉన్న అవకాశాలు, రోగులకు వైద్య చికిత్స సౌకర్యాలను పరిశీలించారు. ఎన్ఎంసీ నిబంధనల మేరకు వార్డులో అన్ని సౌకర్యాలు సంతృప్తికరంగా ఉంటే సీట్లు మంజూరు కానున్నాయి.

ABOUT THE AUTHOR

...view details