ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కనేకల్ మేజర్ పంచాయతీ సర్పంచ్​గా నిర్మల ప్రమాణ స్వీకారం - కనేకల్ మేజర్ పంచాయతీ సర్పంచ్ న్యూస్

అనంతపురం జిల్లా కనేకల్ మేజర్ పంచాయతీ సర్పంచ్​గా నిర్మల ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి హాజరయ్యారు.

kanekal major panchayat sarpanch
కనేకల్ మేజర్ పంచాయతీ సర్పంచ్​గా నిర్మల ప్రమాణ స్వీకారం

By

Published : Feb 25, 2021, 11:45 AM IST

అనంతపురం జిల్లా కనేకల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్​గా నిర్మల... స్థానిక గ్రామ సచివాలయం-1లో ప్రమాణ స్వీకారం చేశారు. ఉప సర్పంచ్​గా నబిసాబ్​తో పాటు 19 మంది వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వైకాపా మద్దతుదారుగా 2251 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

ప్రమాణస్వీకార కార్యక్రమానికి.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వైకాపా ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు, సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై నమ్మకంతోనే.. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ మద్దతుదారులను ప్రజలు గెలిపించారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:అనంతపురం, నెల్లూరు జిల్లాలకు పీఎం కిసాన్‌ పురస్కారాలు

ABOUT THE AUTHOR

...view details