అనంతపురం జిల్లా పామిడి మండలం ఎదురూరు గ్రామంలో.. గ్రామ వాలంటీర్‌గా పని చేస్తున్న ఓ మహిళపై.. రామకృష్ణ(62) అనే వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. వృద్ధుడిపై నిర్భయ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మహిళా గ్రామ వాలంటీర్‌పై వృద్ధుడి అసభ్య ప్రవర్తన..కేసు నమోదు - అనంతపురంలో వృద్ధుడిపై నిర్భయ కేసు
మహిళా గ్రామ వాలంటీర్‌పై ఓ వృద్ధుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వృద్ధుడిపై నిర్భయ సెక్షన్ల కింద కేసు నమోదు అయింది.
nirbhaya cases
వాలంటీర్ తన భర్తకు విషయాన్ని తెలపడంతో మహిళ భర్త కేశవ.. రామకృష్ణ ఇంటికి వెళ్లి నిలదీశాడు. రామకృష్ణ, అతని కుమారులు కలిసి గ్రామ వాలంటీర్ భర్తపై రాళ్లతో దాడి చేశారు. దీంతో గ్రామ వాలంటీర్.. పామిడి పోలీసులను ఆశ్రయించింది. విచారణ చేపట్టిన పోలీసులు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు .. రామకృష్ణ పై నిర్భయ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి.. అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి:ఈటీవీ-భారత్ కథనానికి విశేష స్పందన..రష్యా యువతికి ఆపన్న హస్తం