అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతిఏటా బాబా సన్నిధిలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ప్రశాంతి నిలయంలోని బాబా మహా సమాధిని అందమైన పుష్పాలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అనంతరం సత్యసాయి భక్తి గీతాలతో వేడుకలను ప్రారంభించారు. విద్యార్థులు నిర్వహించిన సంగీత గాన కచేరి అందర్నీ ఆకట్టుకుంది. భక్తులు బాబా మహా సమాధిని దర్శించుకున్నారు.
సత్యసాయి భక్తి గీతాలతో నూతన సంవత్సర వేడుకలు - పుట్టపర్తి తాజా సమాచారం
పుట్టపర్తిలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. సత్యసాయి భక్తి గీతాలతో ప్రారంభమైన ఈ వేడుకల్లో.. విద్యార్థుల సంగీత కచేరి అందర్నీ ఆకట్టుకుంది.
పుట్టపర్తిలో నూతన సంవత్సర వేడుకలు