అనంతపురం జిల్లా తనకల్లు మండలం పరాకువాండ్లపల్లిలో నూతన సంగం డెయిరీ శాఖను ఆ సంస్థ ఛైర్మన్ ధూళిపాళ నరేంద్ర కుమార్ ప్రారంభించారు. పాడి రైతుల శ్రేయస్సే లక్ష్యంగా సంఘం డెయిరీ కృషి చేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా కోట్లాది రూపాయల టర్నోవర్తో సంగం డెయిరీ విజయవంతంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. కరవుకు నెలవైన అనంతపురం జిల్లాలో పాడిరైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు సంగం డెయిరీ దోహదపడుతుందన్నారు.
పాడి రైతుల శ్రేయస్సే లక్ష్యం:ధూళిపాళ నరేంద్ర
పాడిరైతుల శ్రేయస్సే లక్ష్యంగా సంగం డెయిరీ కృషి చేస్తుందని ఆ సంస్థ ఛైర్మన్ ధూళిపాళ నరేంద్ర కుమార్ అన్నారు. అనంతపురం జిల్లా తనకల్లు మండలం పరాకువాండ్లపల్లిలో నూతన సంగం డెయిరీ శాఖను ఆయన ప్రారంభించారు.
'పాడిరైతుల శ్రేయస్సే లక్ష్యంగా సంగం డెయిరీ కృషి'
గుంటూరు, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోనూ ఈ డెయిరీలు పనిచేస్తున్నాయని నరేంద్రకుమార్ చెప్పారు. ఈ సందర్భంగా డెయిరీ లక్ష్యం.. రైతులకు చేయూతనిచ్చేలా చేపడుతోన్న కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్.. సంగం డెయిరీ ప్రత్యేకతలను వివరించారు. సమావేశంలో కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, జిల్లా పరిషత్ మాజీ ఛైర్మన్ రెడ్డెప్పరెడ్డి, రైతులు పాల్గొన్నారు.