వారి పెళ్లి జరిగి 4 నెలలే అయ్యింది... మెుదటిలో సజావుగా సాగిన కాపురంలో తర్వాత గొడవలు మెుదలయ్యాయి. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చేవి. దీంతో ఇంట్లో పెద్దలు ఎవరూ లేని సమయలో ఇద్దరూ ఒకేసారి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇంటికి వచ్చిన తర్వాత అపస్మారక స్థితిలో ఉన్న దంపతులను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. గొడవలు ఎందుకు మెుదలయ్యాయో.. తెలియదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
పెళ్లై 4 నెలలే.. అంతలోనే దంపతుల ఆత్మహత్యాయత్నం - నెలగొండలో నవ వధూవరులు ఆత్మహత్యాయత్నం
కొత్తగా పెళ్లైన జంట వారిది... ఇద్దరి మధ్యలో ఏ గొడవొచ్చిందో తెలియదు... నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. ఈ విషాదకర ఘటన అనంతపురం జిల్లా నెలగొండలో జరిగింది.

నెలగొండలో నవ వధూవరులు ఆత్మహత్యాయత్నం