అనంతపురంజిల్లా పెనుకొండ మండలం తిమ్మాపురం సమీపంలోని సోలార్ పరిశ్రమ వద్ద కల్వర్టును ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. బోల్తా పడిన సమయంలో ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవటంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రమాదానికి గురైన కారు.. కియా పరిశ్రమలో నూతనంగా తయారయ్యింది. పరిశ్రమ నుంచి రోడ్డు మార్గం ద్వారా పెనుకొండ రైల్వే స్టేషన్‌కు తరలించి.. అక్కడ నుంచి రైలు ద్వారా షోరూమ్‌కు తరలించే క్రమంలో ప్రమాదం జరిగింది. పూర్తి విషయాలు తేలాల్సి ఉంది.