అనంతపురం జిల్లాలో కరోనా నిర్ధరణ పరీక్షలను మరింత వేగవంతం చేసేందుకు మరో ల్యాబ్ ను అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటికే వైద్య కళాశాలలో ఓ ప్రయోగశాల ఉండగా.. బత్తలపల్లి మండల కేంద్రంలోని ఆర్డీటీ ఆసుపత్రిలో మరో ల్యాబ్‌ను ప్రారంభించారు. ఇక్కడ రోజూ 3 షిఫ్టుల్లో సిబ్బంది పనిచేస్తారని... రోజుకు 120 నమూనాలు పరీక్షించేలా ఏర్పాట్లు చేశామని అధికారులు చెప్పారు. అనంతపురం వైద్యకళాశాల ప్రయోగశాలలోనూ 3 షిఫ్టుల్లో పనిచేసేలా సిద్ధమవుతున్నామంటున్న జిల్లా ఇన్‌ఛార్జ్ డీఎమ్హెచ్వో రామసుబ్బారావుతో మా ప్రతినిధి ముఖాముఖి.
బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో కరోనా ప్రయోగశాల - covid labs in andhra pradesh
అనంతపురం జిల్లాలో కరోనా నిర్థరణ పరీక్షల నిమిత్తం మరో ప్రయోగశాల అందుబాటులోకి వచ్చింది. బత్తలపల్లి మండల కేంద్రంలోని ఆర్డీటీ ఆసుపత్రిలో రోజూ 3 షిఫ్టుల్లో 120 నమూనాలను పరీక్షించేలా ప్రయోగశాల ఏర్పాటైంది.
బత్తలపల్లి ఆర్డీటీ ఆసుపత్రిలో కరోనా ప్రయోగశాల ఏర్పాటు