కోవిడ్ మరణంతో మరో కొత్త కంటైన్మెంట్ జోన్ ఏర్పాటు - అనంతపురం జిల్లాలో కంటోన్మెంట్ జోన్లు
నెల రోజుల క్రితం పట్టణానికి చెందిన వ్యక్తి బెంగళూరు ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందాడు. కాగా ప్రస్తుతం కరోనా లక్షణాలతో మరో వ్యక్తి మృతి చెందడం ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటించి నివారణ చర్యలు చేపట్టారు.
అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని సాయినగర్ వీధిలో నివసించే 55 సంవత్సరాల వ్యక్తి రెండు రోజుల క్రితం కరోనా లక్షణాలతో మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉన్నవారిని అధికారులు క్వారంటైన్‌కు తరలించారు. వారికి పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం వారందరిని బత్తలపల్లి కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్‌గా ప్రకటించి రాకపోకలను కట్టడి చేశారు. దీంతో మడకశిర లో అధికారులు రెండు కంటైన్మెంట్ జోన్లను ఏర్పటు చేశారు.
ఇవీ చూడండి...