లాక్డౌన్ కారణంగా కుటుంబాల పోషణ భారమైందని.. తమను ప్రభుత్వం ఆదుకోవాలని అనంతపురం జిల్లా నాయీబ్రాహ్మణ సంఘం ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నాయీబ్రాహ్మణులను ప్రభుత్వం విస్మరిస్తోందంటూ అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. నెలరోజులుగా దుకాణాలు మూతపడడంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలతో సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి రూ.10,000 ఇవ్వాలని కోరారు. రెండు నెలల పాటు విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
నాయీబ్రాహ్మణుల అర్ధనగ్న ప్రదర్శన - అనంతపురంలో నాయీ బ్రాహ్మణుల అర్ధనగ్న నిరసన
లాక్డౌన్ కారణంగా దుకాణాలన్ని మూతపడ్డాయని... ఆర్థికంగా కుంగిపోతున్న తమని ఆదుకోవాలని నాయీబ్రాహ్మణులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్థిక సాయం అందించాలని నాయీబ్రాహ్మణ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు డిమాండ్ చేశారు.

Nayi Brahmins protest for giving Financial aid by the govt due to lockdown in ananthapuram