ఆలయాల్లో నవరాత్రి ఉత్సావాలు వైభవంగా జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా విశేష అలంకార భూషితుడై భక్తులకు దర్శనమిచ్చాడు. వేడుకల్లో రెండో రోజు అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి రంగమండపంలో ప్రత్యేక పీఠంపై అధిష్టింపచేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి భారీగా భక్తులు తరలి వచ్చారు. కుమ్మరవాండ్లపల్లి మల్లాలమ్మగుడిలో అమ్మవారిని కాత్యాయిని రూపంలో అలంకరించారు.
కదిరి ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ
శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. కుమ్మర వాండ్లపల్లి మల్లాలమ్మగుడిలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.
ప్రత్యేక అలంకరణలో స్వామివారు