అనంతపురం జిల్లా గుంతకల్లు, గుత్తి మండలాల్లోని గ్రామాల్లో నాటుసారా కేంద్రాల్లోని ఊటలను పోలీసులు నాశనం చేశారు. ప్రభుత్వంమద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తోందని, కానీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా సారా తయారుచేయడం,అమ్మడం చేస్తున్నారన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి లిక్కర్ తయారీ చేసినా.. నిల్వ ఉంచినా వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని అన్నారు.
నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు - _Natu_Saara_Center_Police_Attack anantha puram
అనంతపురం జిల్లాలో సమూలంగా నాటు సారాను నిర్మూలించే దిశగా యంత్రాంగం దృష్టి సారించింది. ఎస్పీ ఆదేశాలతో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడి చేశారు. గుంతకల్లు, గుత్తి మండలాల్లో లిక్కర్ నిల్వలను నాశనం చేశారు.

నాటుసారా స్థావరాలపై... పోలీసుల దాడులు