అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన వేడుక రథోత్సవం భక్తిశ్రద్ధలతో సాగింది. శ్రీదేవి, భూదేవి సమేత నారసింహుడి ఉత్సవమూర్తులను బ్రహ్మరథంపై అధిష్ఠింపజేశారు. ఉదయం 6గంటలకు రథం ముందు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోనే అతి పెద్దదైన రథాన్ని మోకుల సాయంతో భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ లాగారు.
కదిరిలో భక్తి శ్రద్ధలతో లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం - కదిరి రథోత్సవం వార్తలు
కదిరిలో లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం భక్తి శ్రద్ధలతో సాగింది. దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన రథాన్ని మోకుల సాయంతో భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ లాగారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
బ్రహ్మరథంపై దేవదేవుడిని శోభాయమానంగా అలంకరించారు. రథం వద్ద అర్చక స్వాములు కలశ స్థాపన, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన భక్తులతో తిరువీధులు కిక్కిరిసిపోయాయి. నరసింహ గోవిందా అంటూ భక్తుల నామస్మరణతో కదిరి పురం మార్మోగింది. ఉదయం 8.15 గంటలకు ప్రారంభమైన రథోత్సవ తిరువీధుల ఉత్సవం మధ్యాహ్నం 12గంటలకు యథాస్థానానికి చేరుకుంది. భారీగా భక్తులు తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:కదిరిలో వైభవంగా ప్రారంభమైన లక్ష్మీ నరసింహుని రథోత్సవం