ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరిలో వైభవంగా లక్ష్మీనరసింహస్వామి జయంతి - కదిరి నరసింహస్వామి ఉత్సవాలు తాజా వార్తలు

అనంతపురం జిల్లా కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

narasimha jayanthi utsavalu at kadiri
కదిరిలో వైభవంగా లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు

By

Published : May 26, 2021, 12:41 PM IST

కదిరిలో వైభవంగా లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు

లక్ష్మీనరసింహస్వామి జయంతిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కొవిడ్ నిబంధనల దృష్ట్యా పరిమిత సంఖ్యలో భక్తులను దర్శనానికి అనుమతించారు.

శ్రీదేవి భూదేవి సమేతుడైన నరసింహుడి ఉత్సవమూర్తులను రంగ మండపంలోకి తీసుకువెళ్లి సుగంధ పరిమళాలతో కూడిన వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. ప్రత్యేక పీఠంపై ఆశీనులైన స్వామికి పుష్ప, తులసి అర్చనను వైఖానన అగమోక్తంగా నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details