తాడిపత్రి ఘటనలో చట్టాన్ని ఉల్లంఘించి రెచ్చిపోయిన వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ డిమాండ్ చేశారు. వైకాపా ఎమ్మెల్యేలు రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. తెదేపా సీనియర్ నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి లేని సమయంలో ఆయన ఇంటికెళ్లి.. వారి అనుచరులపై తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై చర్యలు తీసుకోవాలి: నారా లోకేశ్ - తాడిపత్రి ఘటనపై నారా లోకేశ్ వ్యాఖ్యలు
అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైకాపా ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి లేని సమయంలో ఆయన ఇంటికెళ్లి.. వారి అనుచరులపై ఎమ్మెల్యే దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు లోకేశ్ తెలిపారు.
nara lokesh on tadipathri incident
Last Updated : Dec 24, 2020, 11:55 PM IST