Nara Lokesh Yuvagalam Padayatra: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. 2023 జనవరి 27న ప్రారంభమైన ఈ పాదయాత్ర ఏప్రిల్ 5 నాటికి 61వ రోజు పూర్తి చేసుకుంది. బుధవారం మధ్యాహ్నం ఉరవకొండ నియోజకవర్గంలోకి ప్రవేశించిన నారాలోకేష్ యువగళం పాదయాత్ర.. గురువారం శింగనమల నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. నిన్న ఉదయం అనంతపురం గ్రామీణ మండలం పిల్లిగుండ్ల కాలనీ నుంచి లోకేష్ పాదయాత్ర ప్రారంభించి, ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు చేరుకున్నారు. కూడేరులో బహిరంగ సభ నిర్వహించిన లోకేష్, ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఎండగట్టారు. ఇప్పటి వరకు 790 కిలోమీటర్ల దూరం పాదయాత్ర నిర్వహించిన లేకేష్ కూడేరు శివారులో రాత్రి బస చేశారు. ఈ రోజు 16 కిలోమీటర్ల దూరం నడిచిన నారా లోకేష్... గురువారం ఉదయం ఎనిమిది గంటలకు 62వ రోజు పాదయాత్ర ప్రారంభిస్తారు.
యువగళం పాదయాత్ర వివరాలు..
- 8.00 – కూడేరు విడిది కేంద్రం నుంచి పాదయాత్ర ప్రారంభం.
- 8.15 – సంగమేష్ కాలనీలో స్థానికులతో మాటామంతీ.
- 9.35 – అరవకూరులో గ్రామస్తులతో సమావేశం.
- 11.45 – కమ్మూరు శివార్లలో బిసి సామాజికవర్గీయులతో ముఖాముఖి.
- 12.45 – కమ్మూరు శివారులో భోజన విరామం.
- 3.45 – కమ్మూరు శివారు నుంచి పాదయాత్ర కొనసాగింపు.
- 4.15 – పాదయాత్ర శింగనమల నియోజకవర్గంలోకి ప్రవేశం, కోటంక వద్ద స్థానికులతో మాటామంతీ.
- 6.00 – కోటంక గండి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో పూజలు.
- 7.30 – మార్తాడు వద్ద విడిది కేంద్రంలో రాత్రి బస.