ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళలను గంట,అర‌గంట అనేవారిని వదిలేసి.. ప్రశ్నించేవాళ్లను అరెస్ట్ చేస్తున్నారు: లోకేశ్ - 57th day Yuva Galam Padayatra

Lokesh Padayatra Day 56: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. పాదయాత్రలో 56వ రోజు నేడు లోకేశ్ 12.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకూ పాదయాత్ర మొత్తం 719.1 కిలోమీటర్ల మేర సాగింది. పాదయాత్ర 57వ రోజు ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో సాగనుంది.

Lokesh Padayatra
నారాలోకేశ్

By

Published : Mar 31, 2023, 10:57 PM IST

Yuva Galam Padayatra: 56వ రోజు పాదయాత్ర:నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. పాదయాత్రలో 56వ రోజు నేడు లోకేశ్ 12.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకూ పాదయాత్ర మొత్తం 719.1 కిలోమీటర్ల మేర సాగింది. పాదయాత్ర 57వ రోజు ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గంలో సాగనుంది.

ఎన్ఆర్ఐ అంజ‌న్​పై కేసు:తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తప్పుపట్టారు.56వ రోజు పాదయాత్రలో పోలీసులపై లోకేశ్ సంచలన ఆరోపణలు చేశారు.సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే పోస్టులు పెడుతున్నాడ‌ని ఎన్ఆర్ఐ అంజ‌న్ పై కించపరిచేలా అనే ముద్ర వేయ‌డం తీవ్ర నేరమని వెల్లడించారు. పోలీసులు వైకాపా కోసం ప‌నిచేసే క‌ట్టప్పల్లా మారిపోవ‌డం వ‌ల్ల, హ‌క్కులు-చ‌ట్టాలున్నాయ‌ని మ‌రిచిపోతున్నారని లోకేశ్ ధ్వజమెత్తారు.

వైసీపీ నేతలపై ఆరోపణలు: అంద‌రికీ విప్పి చూపించిన గోరంట్ల మాధవ్‌, గంట కావాల‌న్న అంబ‌టి, అర‌గంట చాలంటూ చెల‌రేగిన అవంతి ఫోన్లలో పోలీసులకు ఏ సీన్లూ దొర‌క‌లేదా అని నిలదీశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వాళ్ల ద‌గ్గరే గంజాయి, ప్రతిప‌క్షానికి మ‌ద్దతుగా ఉండే వాళ్ల మొబైళ్లలో పోలీసులు కోరుకున్న వీడియోలు దొరుకుతాయని దుయ్యబట్టారు. శాంతిభ‌ద్రత‌ల ప‌రిర‌క్షణ మానేసిన‌ కొంతమంది పోలీసులు, జ‌గ‌న్ రెడ్డి కోసం కిరాయికి ప‌నిచేసే ఐప్యాక్ సిబ్బందిలా మారిపోవ‌డం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత విద్యావంతుడు అంజ‌న్ విష‌యంలో పోలీసులు వ్యవ‌హ‌రించిన తీరు పోలీసు వ్యవ‌స్థకే క‌ళంకమంటూ లోకేశ్ మండిపడ్డారు. దీనికి త‌గిన మూల్యం చెల్లించ‌క త‌ప్పదని హెచ్చరించారు.

లోకేశ్ పాదాలకు బొబ్బలు: మండుటెండలో పాదయాత్ర నిర్వహిస్తున్న లోకేశ్ పాదాలకు బొబ్బలు రావటంతో మంట, నెప్పితో బాధపడుతున్నారు. గడిచిన 56 రోజులుగా లోకేశ్ చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో యువగళం పాదయాత్రతో విరామం లేకుండా మండుటెండలో నడుస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు బూట్లు వేసుకొని ఉండటం, వేసవి ఉష్ణోగ్రత అధికంగా ఉండటంతో పాదాలకు బొబ్బలొచ్చాయి. బొబ్బలు తగ్గటానికి మందులు వాడుతూనే, రోజూ పాదయాత్ర నిర్వహిస్తున్నారు. శుక్రవారం భోజన విరామ సమయంలో నారా లోకేశ్ బూట్లు విప్పిన సమయంలో కాళ్ల బొబ్బలు కనిపించటంతో అక్కడున్న కొందరు ఫోటోలు తీశారు.

57వరోజు (1-4-2023) యువగళం పాదయాత్ర వివరాలు: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 57వ రోజుకు చేరింది. శుక్రవారం రాప్తాడు నియోజకవర్గంలోని సీకే పల్లి మండలంలో 12 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించిన లోకేశ్, అదే మండలం ప్యాదిండి వద్ద రాత్రి బస చేశారు. నేటికి 719 కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించినలోకేశ్, 57వ రోజు పాదయాత్రలో భాగంగా దాదాపు 18 కిలోమీటర్ల మేర నడవనున్నారు. మధ్యాహ్నం ధర్మవరం నియోజకవర్గంలోకి ప్రవేశించనున్నారు. ప్యాదిండి విడిది కేంద్రంలో ఉదయం 11 గంటలకు చేనేత కార్మికుల సమావేశంతో 57వ రోజు షెడ్యూల్ మొదలై ధర్మవరం సీఎన్ బి గ్రాండ్ వద్ద రాత్రి 8.30 కి బసచేసే వరకు కొనసాగనుంది.

56వ రోజు పాదయాత్రలో నారా లోకేశ్
ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details