ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుంతకల్లు మున్సిపల్ ఛైర్​పర్సన్​గా నంగినేని భవాని - నంగినేని భవానిని మున్సిపల్ ఛైర్మన్​గా ఏకగ్రీవంగా ఎన్నుకున్న కౌన్సిలర్లు

అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపల్ ఛైర్​పర్సన్​గా నంగినేని భవాని ప్రమాణ స్వీకారం చేశారు. వైస్​ ఛైర్​పర్సన్​గా మైమూన్​ బీని వార్డు సభ్యులు ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి హాజరయ్యారు. నూతనంగా గెలిచిన కౌన్సిలర్లు.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

nangineni bhavani elected as guntakallu municipal chairman
గుంతకల్లు మున్సిపల్ ఛైర్మన్​గా నంగినేని భవాని

By

Published : Mar 18, 2021, 8:45 PM IST

అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపాలిటీలో ఛైర్​పర్సన్ ఎంపిక అట్టహాసంగా జరిగింది. నంగినేని భవానికి పలువురు సభ్యులు మద్దతు తెలపడంతో.. ప్రిసైడింగ్ అధికారి ఆమెను ఛైర్మన్​గా ప్రకటించారు. వైస్ ఛైర్​పర్సన్ గా మైమూన్ బీ ని సభ్యులు ఎన్నుకున్నారు. ప్రత్యేక పర్యవేక్షణ అధికారి గంగాధర్ గౌడ్ ఎదుట.. ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి మొదట ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వైకాపా, తెదేపా, సీపీఐకి చెందిన సభ్యులతో ప్రమాణం చేయించారు.

విజయోత్సవం...

పట్టణంలోని ఎస్.ఎల్.వి కూడలిలోని వైఎస్ఆర్ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కౌన్సిలర్లతో కలిసి పురపాలక సంఘం కార్యాలయానికి ర్యాలీగా వెళ్లారు. మున్సిపాలిటీలో మొత్తం 37 వార్డులు ఉండగా.. స్వతంత్ర అభ్యర్థితో కలిపి వైకాపాకు 29 మంది సభ్యులు ఉన్నారు. తెదేపా సభ్యులకు తగినంత మెజారిటీ లేకపోవడంతో.. ప్రమాణ స్వీకారం చేసి సభ మధ్యలోనే వెళ్లిపోయారు.

ఇదీ చదవండి:

అనంతపురం మేయర్​గా​ మహమ్మద్ వసీం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details