అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం చదం గ్రామ సమీపంలోని లింగాలబండపై వెలసిన చతుర్ముఖ శ్రీ పశుపతి నాథుని ఆలయంలోని నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అంతర్వేదిలో రథం దగ్ధం జరిగన రోజే పశుపతినాథుని ఆలయంలోని రాతి నంది విగ్రహం రెండు చెవులు, ముఖాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ క్రమంలో హైందవ దేవాలయాలకు రక్షణ లేదని.. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా కుట్రలు చేసే వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని విహెచ్పి కార్యకర్తలు ఆలయం వద్ద నిరసన తెలిపారు.
పశుపతినాథుని ఆలయంలో నంది విగ్రహం ధ్వంసం - Nandi idol destroyed in Pashupatinath temple
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం చదం గ్రామ సమీపంలోని లింగాలబండపై వెలసిన చతుర్ముఖ శ్రీ పశుపతి నాథుని ఆలయంలో ఉన్న నంది విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.
పశుపతినాథుని ఆలయంలో నంది విగ్రహం ధ్వంసం
రెండేళ్ల క్రితం గుప్త నిధుల కోసం ఆలయంలోని రాతి విగ్రహాన్ని ధ్వంసం చేయగా గ్రామస్థులు, ఆలయ పీఠాధిపతులు రెండున్నర లక్షల రూపాయలు వెచ్చించి నూతన విగ్రహాన్ని ప్రతిష్టించారు. తిరిగి అదే ఆలయంలోని నూతన విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై హిందువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, భక్తులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇవీ చదవండి: రైలు ఢీకొని గొర్రెలు మృతి