Meals for Rs.2: తెలుగుదేశం హయాంలో ఎన్టీఆర్ పేరుతో అన్నక్యాంటీన్ పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. కేవలం 5 రూపాయలకే భోజనం, అల్పాహారం అందించింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్న క్యాంటీన్లను మూసేసింది. అయితే పేదల ఆకలిని తీర్చేందుకు విదేశాల్లోని ఎన్టీఆర్ అభిమానులు.. ఓ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏడాది పాటుగా కేవలం రెండు రూపాయలకే అన్నదాన వితరణను చేపట్టారు. సత్యసాయి జిల్లా హిందూపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా.. పలుచోట్ల ఈ భోజన సేవను ప్రారంభించారు. నెల రోజుల క్రితం ఈ భోజన వితరణ సేవ ప్రారంభం కాగా.. హిందూపురం అధికార పార్టీ నాయకులు అడ్డుకోవాలని ప్రయత్నాలు చేశారు. నందమూరి అభిమానులు వెనక్కు తగ్గకుండా అన్నం, పప్పు, రసం, కూర, మజ్జిగతో పాటు రోజుకూ ఒక స్పెషల్ వంటకంతో..రుచికరంగా పేదలకు భోజనం అందిస్తున్నారు.