‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఎలా బెదిరింపులకు పాల్పడుతోందో ప్రజలు గమనిస్తున్నారు. మైండ్‌గేమ్ రాజకీయాలు చేస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో జరగాల్సిన ఎన్నికల్లో అలజడులు సృష్టిస్తూ.. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కొన్ని కుటుంబాల వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. అడిగే వారు లేరని అధికార పార్టీ వారు బరి తెగిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా.. ప్రజల్లో ఎవరికి విలువలు ఉంటాయో.. అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంటుందో వారికే ఓటు వేస్తారు. కాదని బెదిరింపులకు దిగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హెచ్చరించారు.
నా ప్రాణం పణంగా పెడతా: నందమూరి బాలకృష్ణ - ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వార్తలు
సోమవారం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో తెదేపా నాయకులను పరామర్శించారు. తెదేపా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని, అవసరమైతే ప్రాణాన్ని పణంగా పెడతానన్నారు.
nandamuri balakrishna