ప్రజా శ్రేయస్సులో నర్సుల పాత్ర ఎంతో కీలకమని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొనియాడారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. "నర్సులు ఎప్పుడూ తగిన గౌరవం పొందలేదు. వారి పాత్ర ఎంత ముఖ్యమో, వారికి ఇవ్వాల్సిన గౌరవం ఎంతటిదో తెలిపేందుకు కిందటి ఏడాది ఎన్నో ఘటనలు, ఉదాహరణలు మిగిల్చింది. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి తరఫున నర్సులందరికీ నా వందనాలు తెలుపుతున్నా" అని ఓ ప్రకనటలో పేర్కొన్నారు.
ప్రజా శ్రేయస్సులో నర్సుల పాత్ర కీలకం: బాలకృష్ణ - AP News
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా నందమూరి బాలకృష్ణ.. నర్సులకు శుభాకాంక్షలు తెలిపారు. నర్సుల పాత్ర ఎంత ముఖ్యమో, వారికి ఇవ్వాల్సిన గౌరవం ఏపాటిదో తెలిపేందుకు కిందటి ఏడాది ఎన్నో ఘటనలను, ఉదాహరణలు మిగిల్చిందని వ్యాఖ్యానించారు.
నందమూరి బాలకృష్ణ