కరోనా కట్టడికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలు అప్రమత్తవుతున్నాయి. కానీ.. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలోని నల్లగుట్ట బజారులో గత కొద్ది రోజులుగా మురుగు కాలువలు శుభ్రం చేయటం లేదు. దీంతో దోమల తీవ్రత విపరీతంగా పెరిగిందని అక్కడి ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. వీటికి తోడు నివాసాల గోడలు మురుగు నీటితో తడుస్తూ దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. సమస్యను మునిసిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చి.. వారిని శాంతింపచేశారు.
'వీధులు శుభ్రం చేయండి' - nalagutta bazar people protest in kadiri
ఒక వైపు కరోనా వైరస్ మహమ్మారి భయం.. మరోవైపు నివాసాల చుట్టూ అపరిశుభ్రత ఆ వీధి వాసులను ఆందోళనకు గురి చేసింది. పలుమార్లు అనంతపురం జిల్లా కదిరి మునిసిపల్ యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా స్పందన లేని కారణంగా.. నల్లగుట్ట బజారులోని ప్రజలు రహదారిపై ధర్నా చేశారు.
!['వీధులు శుభ్రం చేయండి' nalagutta bazar people protest](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6796888-1006-6796888-1586924400947.jpg)
వీధులు శుభ్రం చేయాలని నల్లగుట్ట బజారు స్థానికుల ధర్నా