అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో 30 సంవత్సరాలుగా దాయాదుల మధ్య భూ తగాదాలు ఉన్నాయి. కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని ఓ వర్గం వారు వ్యవసాయం చేయటానికి వెళితే మరో వర్గం వారు దాడి చేశారు. ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు. గాయపడిన రామదాసు, కిష్టప్ప, పద్మ, బాబు, శ్రావణి, రమేష్, శీన, మంజులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
భూతగాదాలలో ఇరువర్గాల ఘర్షణ.. ఎనిమిది మందికి గాయాలు.. - land issues
దీర్ఘ కాలంగా వివాదంలో ఉన్న భూ సమస్యపై ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురం జిల్లా కుందుర్పి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
భూతగాదాలలో పరస్పర ఘర్షణ..ఎనిమిది మందికి గాయాలు..