ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ముస్లింలు ఇళ్ల వద్దే ప్రార్థనలు చేసుకోవాలి' - police guidlines to muslims

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ముస్లిం మత పెద్దలతో సీఐ తులసీరామ్, ఎస్సై రాఘవేంద్రప్ప ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముస్లింలు రంజాన్ మాసంలో ఇళ్ల వద్దే ప్రార్థనలు నిర్వహించుకోవాలని కోరారు.

Anantapuram
'ముస్లింలు ఇళ్ల వద్దే ప్రార్థనలు చేసుకోవాలి'

By

Published : Apr 23, 2020, 4:27 PM IST

అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో గురువారం ముస్లిం మత పెద్దలతో సీఐ తులసీరామ్, ఎస్సై రాఘవేంద్రప్ప ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రంజాన్ ప్రార్థనలు... సరుకుల పంపిణీపై సూచనలు చేశారు. ముస్లింలు ఇళ్ల వద్దే ప్రార్థనలు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి మసీదులో ఇమామ్ తో పాటు మరో ముగ్గురికి మాత్రమే అజాన్ ఇచ్చుకోవచ్చన్నారు.

సామాజిక దూరం పాటిస్తూ.. పేదల ఇళ్ల వద్దే సరుకులు అందించాలన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు ముస్లింలు సహకరించాలని కోరారు. రంజాన్ ప్రార్థనలు ఇళ్ల వద్ద చేసుకోవడం వల్ల కరోనా ను కట్టడి చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం ఖాజీ సైఫుల్లా పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details