ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఓ వర్గంపై కక్ష తీర్చుకునేందుకే ఈ చట్టం - పౌరసత్వ సవరణ చట్టం తాజా వార్తలు

కదిరిలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ముస్లింలు, ప్రజా సంఘాల నాయకులు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరసనలు కొనసాగిస్తామని ఆందోళనకారులు హెచ్చరించారు.

muslims protest at anantapur
ప్లకార్డులతో ప్రదర్శనగా నిరసన తెలుపుతున్న ముస్లింలు

By

Published : Dec 18, 2019, 11:31 AM IST

పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. అనంతపురం జిల్లా కదిరిలో ముస్లిం, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ఓ వర్గంపై కక్ష తీర్చుకునేందుకే ఇలాంటి చట్టాన్ని తీసుకొచ్చిందని ప్రజానాయకులు విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళనలు మిన్నంటాయని అన్నారు. నిరసనలు తెలుపుతున్న వారిపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆందోళనకారులు తప్పుపట్టారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ... పట్టణంలోని జాతీయ రహదారిపై ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే వరకు నిరసనలు ఆపమని... ప్రజా సంఘాల నాయకులు స్పష్టం చేశారు.

ఓ వర్గంపై కక్ష తీర్చుకునేందుకే ఈ చట్టం..

ABOUT THE AUTHOR

...view details