అనంతపురం జిల్లా హిందూపురంలో వినాయక ఉత్సవాల్లో భాగంగా విశ్వ సేన వినాయక సేవా సమితి ప్రతి సంవత్సరం వినాయకుని పూజలకు ముస్లిం సోదరులను ఆహ్వానించడం ఆనవాయితీగా వస్తోంది. వారి ఆహ్వానం మేరకు ముస్లిం సోదరులు పాల్గొని.. మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నారు. గణనాథుడి పూజ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని పలువురు ముస్లిం సోదరులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
కొనసాగుతున్న ఆనవాయితీ..వినాయకుడి పూజలో ముస్లిం సోదరులు - hindupuram news
హిందుపురంలో విశ్వసేన వినాయక సమితి వారు నిర్వహిస్తున్న వినాయక చవితి వేడుకలు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్నాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం హిందూ-ముస్లింలు కలిసి వేడుకలు నిర్వహిస్తున్నారు. వినాయక సేవా సమితి వారు ముస్లింలను ఆహ్వానిస్తుండగా.. ప్రతి ఏటా వారు పాల్గొంటున్నారు.
మత సామరస్యానికి ప్రతీక.. వినాయక పూజల్లో ముస్లిం సోదరులు