కామాంధుడిని ఉరి తీయాలంటూ అనంతలో ర్యాలీలు - dhisti bomma
అనంతపురంలో అభం శుభం తెలియని చిన్నారిపై హత్యాచారం చేసిన 40 ఏళ్ల కామాంధుడిని ఉరితీయాలని ఏఐఎస్ఎఫ్, ముస్లింలు ర్యాలీ నిర్వహించారు.
అనంతలో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడిన 40 ఏళ్ల కామాంధుడిని ఉరితీయాలని డిమాండ్ చేస్తూ ముస్లిం సోదరులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. క్లాక్ టవర్ సమీపంలో నిందితుడి దిష్టి బొమ్మను ఏఐఎస్ఎఫ్ నాయకులు దగ్ధం దహనం చేశారు. అధికారులు స్పందించి కామాంధుడికి కఠిన శిక్ష పడేలా చేసి...బాధితకుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితులపై చొరవ తీసుకుని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. సప్తగిరి సర్కిల్ వద్ద మానవ హారంగా ఏర్పడిన ముస్లింలు...కామాంధుడిని ఉరి తీయాలంటూ నినాదాలు చేశారు. అక్కడి నుంచి జిల్లా ఎస్పీ కార్యాలయం వరకూ ర్యాలీ కొనసాగించి వినతి పత్రం అందించారు.