జాతీయ పౌరసత్వ చట్టం ఉపసంహరించుకోవాలంటూ అనంతపురం జిల్లా గుంతకల్లులో ముస్లిం సంఘాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఏబీ... ఎన్ఆర్సీనీ వ్యతిరేకిస్తూ స్థానిక ఈద్గా మైదానం నుంచి పొట్టి శ్రీరాములు కూడలి వరకు భారీ ర్యాలీ చేపట్టారు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దేశంలో తమ ఓటు హక్కు శాతం ఎక్కువగా ఉందని.. ఇక నుంచి ప్రతి ఒక్కరూ.. ప్రతి ఎన్నికల పాల్గొని సత్తా చూపాలని పలువురు పెద్దలు యువతకు సూచించారు. భారతదేశంలో జీవిస్తున్న తమను వెళ్లగొట్టే చర్యలకు భాజపా పాల్పడుతోందని అన్నారు. అటువంటి చర్యలను కేంద్రం వెనక్కు తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు.
'ముస్లింలను వెళ్లగొట్టే చర్యలకు భాజపా పాల్పడుతోంది' - national citizenship bill latest news in telugu
జాతీయ పౌరసత్వ చట్టం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ... గుంతకల్లులో ముస్లిం సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. స్వాతంత్ర పోరాటంలో ఎక్కువగా ముస్లిం సోదరులు ప్రాణాలు పొగుట్టుకున్నారని గుర్తు చేశారు.
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా గుంతకల్లులో ముస్లిం సంఘాలు ర్యాలీ