అనంతపురం జిల్లా పెనుగొండలో సీఏబీ... ఎన్ఆర్సీనీ వ్యతిరేకిస్తూ అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ముస్లిం సంఘాలు ధర్నా నిర్వహించాయి. స్థానిక ఈద్గా నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు చేసిన ర్యాలీలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ నిశాంతికి వినతిపత్రం ఇచ్చారు. సబ్ కలెక్టర్ బయటకు వచ్చే సమాదానం చెప్పాలని ముస్లింలు కోరటంతో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు కలగజేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు.
'జాతీయ పౌరసత్వ బిల్లు ఉపసంహరించుకోండి' - muslim dharna news in penugonda
జాతీయ పౌరసత్వ బిల్లు ఉపసంహరించుకోవాలని.. అఖిలపక్షం ఆధ్వర్యంలో పెనుగొండలో ముస్లిం సంఘాలు ధర్నా నిర్వహించారు. సీఏబీ... ఎన్ఆర్సీనీ వ్యతిరేకిస్తూ స్థానిక ఈద్గా నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు.
muslim unions dharna in ananthapuram district